హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్‌ను తొలగించాలి: సీఐటీయూ

AKP: ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ ఏకపక్ష నిర్ణయాలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని సీఐటీయూ నేత గనిశెట్టి సత్యనారాయణ అన్నారు. సీఈసీని వెంటనే తొలగించాలని, ఢిల్లీలో నిరసనకారులపై లాఠీఛార్జీని ఖండిస్తూ శనివారం పరవాడ సంత వద్ద నిరసన చేపట్టారు. ఎస్‌ఐఆర్ పేరిట అక్రమంగా తొలగించిన అర్హులైన ఓట్లను తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.