హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: త్వరలో ఆదోని–2 కరవు మండలంగా ప్రకటన

KRNL: ఆదోని –2ను కరవు మండలంగా ప్రకటించాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, కర్నూలు ఎంపీ నాగరాజుకు విజ్ఞప్తి చేసినట్లు టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ తెలిపారు. త్వరలో ఆదోని –2ను కరవు మండలంగా ప్రకటించే అవకాశం ఉందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. రైతులు అధైర్యపడవద్దని, రైతులకు న్యాయం జరిగేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.