హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన

అన్నమయ్య: లక్కిరెడ్డిపల్లెలోని వేంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో రూ.26 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి శంకుస్థాపన చేశారు. రాయచోటి నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, ప్రజల సౌకర్యార్థం మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. పనులు నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.