PPM: కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను వెంటనే భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం కొమరాడ మండల కేంద్రంలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణపేరుతో ఓటర్ల హక్కులకు భంగం కలుగుతోందని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా వ్యవహరించాలనఅన్నారు.
ఆంధ్రప్రదేశ్
జ్ఞానేశ్ కుమార్‌ను భర్తరఫ్ చేయాలి


