హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అంతర్‌జిల్లా బైక్ దొంగల ముఠా గుట్టురట్టు

విశాఖపట్నం, అనకాపల్లి పరిధిలో వరుస ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేసినట్లు డీఎస్పీ పి.వి. నరసింహారావు వెల్లడించారు. వెంగన్నపాలెం జంక్షన్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకుని, వారి నుంచి 6 బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సీఐ అప్పలరాజు, ఎస్సై నాగకార్తీక్‌ నేతృత్వంలోని పోలీసు బృందం చాకచక్యంగా వ్యవహరించి కేసును ఛేదించిందన్నారు.