హైదరాబాద్: 28°C
తెలంగాణ

దొంగతనాల నివారణకు పోలీసు వారి విజ్ఞప్తి

HYD: బతుకమ్మ, దసరా పండుగలకు సొంతూర్లకు వెళ్లే ప్రజల కోసం సైబరాబాద్ పోలీసులు 'X' వేదికగా కీలక సూచనలు జారీ చేశారు. ఇంట్లోని నగదు, బంగారాన్ని లాకర్లలో భద్రపరుచుకోవాలని, సెంట్రల్ లాక్, సీసీ కెమెరాలు, సెక్యూరిటీ అలారాలు అమర్చుకోవాలని సూచించారు. సోషల్ మీడియాలో ప్రయాణ వివరాలు పెట్టవద్దని, అత్యవసరమైతే 112 కి కాల్ చేయాలని తెలిపారు.