హైదరాబాద్: 28°C
తెలంగాణ

డంపింగ్ యార్డ్‌పై ఏడో రోజూ కొనసాగిన రిలే దీక్షలు

RR: జీవో 641ని రద్దు చేసి, డంపింగ్ యార్డ్ ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ సిద్దాపూర్ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఏడో రోజుకు చేరాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని జేఏసీ ఛైర్మన్ రాంబాల్ నాయక్, నాయకులు తెలిపారు. ఈ దీక్షలకు స్థానిక సర్పంచ్ బసు నాయక్, రైతులు, మహిళలు, యువకులు మద్దతు తెలిపారు.