NTR: గండేపల్లిలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. 25వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన ఈ వేడుకల సందర్భంగా అమ్మవారిని విద్యుత్ దీపాలు, పూలతో అద్భుతంగా అలంకరించారు. తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. గండేపల్లి, కీసర, పెండ్యాల గ్రామాల నుంచి వందలాది మంది భక్తులు పాల్గొంటున్నారు. ఈ ఏడాది 250 మందికి పైగా భవానీ మాలధారణ చేశారు.
ఆంధ్రప్రదేశ్
గండేపల్లిలో దసరా వేడుకలు ప్రారంభం


