హైదరాబాద్: 28°C
తెలంగాణ

యాదాద్రికి జీ9 బొగ్గు సరఫరా

NLG: దామరచర్లలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటుకు నాణ్యమైన బొగ్గు సరఫరా చేసేందుకు జెన్కో చర్యలు చేపట్టింది. ఒడిశాలోని మహానది గనుల నుంచి రోజుకు 14 వేల టన్నుల బొగ్గును కోల్ ఇండియా ద్వారా సరఫరా చేయనున్నారు. సింగరేణి నుంచి కూడా బొగ్గు అందించనున్నారు. ఐదు యూనిట్లకు నిరంతరంగా నాణ్యమైన బొగ్గు అందితే 4,000 మెగావాట్ల ప్లాంటులో విద్యుత్ ఉత్పత్తి పెరగనుంది.