GNTR: తెనాలిలో నూతనంగా ప్రారంభించిన స్వర్ణాంధ్ర పార్క్ దసరా పండుగ వరకు తాత్కాలికంగా ఉదయం 6 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 6.30 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉంటుందని మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. పార్కులోని మొక్కలు, పచ్చదనం, ఆస్తులకు నష్టం కలిగించకుండా పరిశుభ్రతను కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్
తెనాలి స్వర్ణాంధ్ర పార్క్ సందర్శన వేళలు ఇవే!


