హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ ఉచ్చుకు.. వ్యక్తి బలి

BHPL: ఆజాంనగర్‌లో పండుగ పూట విషాదం నెలకొంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన జడల అశోక్ తన భూమిలో పత్తి సాగు చేస్తున్నాడు. ఈ క్రమంలో పంటకు అడవిపందుల బెడద నేపథ్యంలో కాపలా ఉండడానికి రాత్రి వెళుతుండగా మార్గ మధ్యలో వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చుకు తాకి మృతి చెందాడు. కాగా శవాన్ని వేటగాళ్లు మాయం చేశారంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు.