హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

VSP: కంచరపాలెం సూర్య నగర్‌లోని యోగ సిద్ధాంజనేయ స్వామి ఆలయంలో ఇవాళ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భాద్రపద మాసం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామిని దర్శించుకున్నారు. ఆంజనేయ స్వామికి సింధూర అర్చన, ప్రాతఃకాల అర్చన, మంగళహారతి జరిగాయి. భక్తులకు ఇబ్బందులు లేకుండా కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు.