హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెత్తర అమావాస్యతో మాంసం దుకాణాల వద్ద రద్దీ

SDPT: పెత్తర అమావాస్యను పురస్కరించుకుని హుస్నాబాద్ పట్టణంలో మాంసం దుకాణాలు రద్దీగా మారాయి. పండుగ సందర్భంగా మాంసం కొనుగోలు చేసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో దుకాణాలకు తరలివచ్చారు. దీంతో పట్టణంలోని మాంసం, చికెన్ దుకాణాల వద్ద సందడి నెలకొంది. మాంసం ధర కిలోకు రూ.1,000 నుంచి రూ.1,200 వరకు పలుకుతోంది. లైవ్ చికెన్ కిలో రూ.150, సాధారణ చికెన్ కిలో రూ.280గా వుంది.