SRPT: పెన్పహాడ్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం సమీపం నుంచి కాలనీకి వెళ్లే దారిలో కల్వర్టు ధ్వంసమై ప్రమాదకరంగా మారింది. స్లాబ్ లేచిపోవడంతో గొయ్యి ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రాత్రివేళ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్త కల్వర్టు నిర్మిస్తామని గ్రామపంచాయతీ కార్యదర్శి నాగరాజు తెలిపారు.
తెలంగాణ
కల్వర్టు ధ్వంసం.. వాహనదారులకు తప్పని తిప్పలు


