హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలి: SP

BDK: జూలూరుపాడు మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను జిల్లా SP రోహిత్‌రాజు IPS వార్షిక తనిఖీలో భాగంగా సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్‌లోని రికార్డులు, కేసుల వివరాలను పరిశీలించి, పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు సత్వర న్యాయం అందించాలని పోలీసు అధికారులకు సూచించారు. ఫిర్యాదు దారులతో మర్యాదగా ప్రవర్తించాలని పేర్కొన్నారు.