హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈ నెల 12 నుంచి ఆందోళనలు: మాజీ ఎమ్మెల్యే

BDK: జిల్లాలో ఇసుక లారీల అధిక లోడ్లు, రహదారుల ధ్వంసం, ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే రేగా డిమాండ్‌ చేశారు. మైనింగ్‌ నిధులను స్థానిక అభివృద్ధికే కేటాయించాలన్నారు. ఈ నెల 12 నుంచి నవంబర్‌ 5 వరకు దశలవారీగా ఆందోళనలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇసుక క్వారీల వద్ద రాస్తారోకోలు కలెక్టరేట్‌ ముట్టడి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.