KRNL: బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించే విషయంలో టీడీపీ కట్టుబడి ఉందని ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. చట్టపరంగా న్యాయం చేయలేకపోయినా పార్టీ పరంగా న్యాయం చేస్తామని ఆయన తెలిపారు. వైసీపీ నేతలు కోర్టులను ఆశ్రయించి రిజర్వేషన్లను అడ్డుకున్నారని ఆరోపించారు. బీసీలను ఓటు బ్యాంకుగా చూస్తున్న వైసీపీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
బీసీ రిజర్వేషన్లపై టీడీపీ కట్టుబడి ఉంది: ఎంపీ


