హైదరాబాద్: 28°C
తెలంగాణ

వైకుంఠధామంలో వాటర్ ట్యాంకు పరిశీలన

SRPT: మార్నింగ్ వాక్‌లో భాగంగా నడిగూడెం మండల సర్పంచ్ దున్న శ్రీనివాస్ వైకుంఠధామంలో దాత దివ్వెల శ్రీనివాసరావు దాతృత్వంతో ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంకును పరిశీలించారు. వైకుంఠధామానికి వచ్చే ప్రజలకు నీటి సౌకర్యం కల్పించేందుకు దాత ముందుకు రావడంపై అభినందించారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు దాతలు సహకరించడం అభినందనీయమని పేర్కొన్నారు.