హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డప్పు కళాకారుడు కమ్మిడి బంటు మృతి

ASR: డుంబ్రిగూడ గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన ప్రముఖ డప్పు కళాకారుడు కమ్మిడి బంటు ఇవాళ ఉదయం అనారోగ్యంతో మృతి చెందారు. స్థానిక దింసా బృందంతో కలిసి పలు రాష్ట్రాల్లో డప్పు వాయిస్తూ గిరిజన కళా సంస్కృతిని చాటారు. ఆయన మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. స్థానికులు, దింసా కళాకారులు ఆయన మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు.