హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గ్రానైట్ ఫ్యాక్టరీలో కూలి మృతి

ప్రకాశం: చీమకుర్తి(M)లోని యుఎస్ గ్రానైట్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. కటింగ్ మిషన్ వద్ద ప్రమాదవశాత్తు గ్రానైట్ రాయి కూలిపై పడడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జగన్ సింగ్‌గా పోలీసులు తెలిపారు. జరిగిన ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగినట్లు పోలీసులు అబిప్రాయపడుతున్నారు.