ప్రకాశం జిల్లా ఒంగోలులోని లాయర్ పేటలో ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం వెలుగు చూసింది. ఓ అపార్ట్మెంట్ కు వాచ్‌మెన్‌గా వ్యవహరిస్తున్న ప్రసాద్ తన గదిలో ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనేది విచారణలో తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య


