మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం భూపతిపేటకు చెందిన కాల్వల వీరస్వామి (48) శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఖానాపూర్ మండల కేంద్రం సమీపంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద ఆగి ఉన్న టిప్పర్‌ను ఆయన బైక్ ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
టిప్పర్‌ను ఢీకొని వ్యక్తి మృతి


