హైదరాబాద్: 28°C
తెలంగాణ

జాతీయ బ్యాడ్మింటన్‌లో శ్రీచేతన్‌ శౌర్యకు పతకాలు

హన్మకొండకు చెందిన షట్లర్‌ సామల శ్రీచేతన్‌ శౌర్య జాతీయస్థాయి బ్యాడ్మింటన్‌ పోటీల్లో అండర్‌-15 డబుల్స్‌లో స్వర్ణం, అండర్‌-17 సింగిల్స్‌లో కాంస్య పతకం సాధించాడు. జైపూర్‌లో జరిగిన ఆల్‌ ఇండియా బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో ఈ ఘనత సాధించాడు. ఇటీవల చైనాలో జరిగిన ఆసియా పోటీల్లోనూ క్వార్టర్‌ ఫైనల్‌ వరకు చేరుకున్నాడు.