విశాఖపట్నం నగరపాలక సంస్థ ఎన్నికల నిర్వహణకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. నగరంలోని 120 వార్డుల్లో 1,990 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 18.40 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనుండగా, ఎన్నికల విధుల కోసం 14,328 మంది సిబ్బందిని నియమించనున్నారు. తొలి దశలోనే విశాఖలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్
విశాఖలో జీవీఎంసీ ఎన్నికలకు ఏర్పాట్లు


