హైదరాబాద్: 28°C
తెలంగాణ

డిపో వద్ద ప్రైవేట్ ఆర్టీసీ డ్రైవర్ల నిరసన

WNP: డిపో మేనేజర్ ఒత్తిళ్లు, అధిక స్టాపుల వల్ల మైలేజీ తగ్గి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రైవేట్ ఆర్టీసీ డ్రైవర్లు డిపో వద్ద బస్సులు నిలిపి నిరసన తెలిపారు. బస్సుల డోర్ల వద్ద వేలాడుతూ ప్రయాణికులు వెళ్లడం వల్ల ప్రమాదాలు జరిగితే తమనే బాధ్యులను చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు బస్సులు నడపబోమని స్పష్టం చేశారు.