GDW: అయిజలో మున్సిపల్ నిబంధనలు ఉల్లంఘించిన భవనాలపై చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర రావు హెచ్చరించారు. గృహ నిర్మాణ అనుమతులు పొంది వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న మూడు సముదాయాలను శుక్రవారం ఉదయం తనిఖీ చేసి సీజ్ చేశారు. మున్సిపల్ చట్టం 2019 ప్రకారం నిర్మాణాలు చేపట్టాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
తెలంగాణ
అనుమతుల ఉల్లంఘనపై మూడు భవనాలు సీజ్


