హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చెరువులో పడి మూడేళ్ల చిన్నారి మృతి!

W.G : ​భీమవరం రూరల్ మండలం గొట్లపాడులో తీవ్ర విషాదం నెలకొంది. ఇంటి ముందు ఆడుకుంటూ వెళ్లిన మూడేళ్ల తేజేశ్వరి ఆక్వా చెరువులో పడి ప్రాణాలు కోల్పోయింది. పాప కనిపించకపోవడంతో గాలించిన తల్లి మరియమ్మ, చెరువులో తేలివున్న చిన్నారిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించింది. అయితే అప్పటికే పాప మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.