హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి..!

ELR: కైకలూరు మండలం శృంగవరపాడులో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన హరిబాబు (51)  కొల్లేరులో చేపల వేటకు వెళ్లి శవమై కనిపించాడు. కైకలూరు రూరల్ SI వి. రాంబాబు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కైకలూరు తరలించారు.