హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీశైలంలో 11 నుంచి దసరా ఉత్సవాలు

NDL: శ్రీశైలంలో ఈ నెల 11 నుంచి దసరా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, వాహన సేవలు నిర్వహిస్తారు. 11న శైలపుత్రి, బృంగి వాహనం, 12న బ్రహ్మచారిణి, మయూర వాహనం, 13న చంద్రఘంట, రావణ వాహనం సేవలు ఉంటాయి. 20వ తేదీ వరకు వివిధ వాహన సేవలు కొనసాగుతాయి.