కర్నూల్ స్టాంటన్‌పురానికి చెందిన మనోజ్ కుమార్(9) రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. నాలుగో తరగతి చదువుతున్న అతను సెలవుల నేపథ్యంలో తన అన్న సాయి చరణ్‌తో బైక్‌పై నందికొట్కూరుకు బయల్దేరాడు. సఫా ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో శుక్రవారం బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. మనోజ్ మృతిచెందగా, సాయి చరణ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి


