హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కార్మికులకు జీతాలు సకాలంలో ఇవ్వాలి: CITU

WG: పెనుగొండ పంచాయతీ కార్మికులతో గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ & వర్కర్స్ (CITU) జిల్లా అధ్యక్షులు ఎం.ఆంజనేయులు శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కార్మికులకు ప్రతి నెల 5వ తేదీ లోపు వేతనాలు చెల్లించాలని, పెరిగిన నిత్యావసర ధరలను దృష్టిలో పెట్టుకొని వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు.