హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కల్లూరులో రూ.2.01 కోట్ల పనులకు భూమిపూజ

KRNL: కల్లూరు అర్బన్‌లో పలు అభివృద్ధి పనులకు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి శుక్రవారం రాత్రి భూమిపూజ చేశారు. 41వ వార్డులో సీసీ రోడ్లకు రూ.38 లక్షలు, 29వ వార్డులో సీసీ డ్రైనేజీకి రూ.50.93 లక్షలు, 19, 20, 21వ వార్డుల్లో సీసీ రోడ్లకు రూ.1.12 కోట్లతో చేపట్టే పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.