హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈనెల 11 నుంచి శరన్నవరాత్రి వేడుకలకు ఏర్పాట్లు

అనకాపల్లి పట్టణం గవరపాలెం శతకంపట్టులో గల కనకదుర్గమ్మ ఆలయంలో ఈనెల 11వ తేదీ నుంచి శరన్నవరాత్రి వేడుకలను వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. నవరాత్రి వేడుకల్లో అమ్మవారు రోజుకొక అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. భవాని భక్తులకు పది రోజులు అన్న సమారాధన నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.