హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు

NDL: గ్రామాల్లో అల్లర్లు, గొడవలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని మహానంది ఎస్సై రామ్మోహన్ రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం రాత్రి తిమ్మాపురంలో ప్రజలతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. గ్రామస్థులు విభేదాలకు తావివ్వకుండా సోదరభావంతో మెలగాలని కోరారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఎంతటివారినైనా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.