హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెళ్లి ఆలస్యం,అప్పుల భారం.. ఆపై ఆత్మహత్య!

కోనసీమ: పెళ్లి కావడం లేదన్న బెంగతో అమలాపురం భూపతి అగ్రహారానికి చెందిన కాదంబరి గోపాల సుబ్రహ్మణ్య మురళి కుమార్ (42) ఆత్మహత్య చేసుకున్నాడని అమలాపురం టౌన్ సీఐ వీరబాబు శుక్రవారం తెలిపారు. మృతుడి తల్లి విజయలక్ష్మి ఫిర్యాదుపై కేసు నమోదు చేశామన్నారు. పెళ్లి కావడం లేదన్న మనోవేదన, అప్పుల భారంతో ఈ నెల 2వ తేదీన పురుగుల మందు తాగి ఆత్మహత్యకు చేసుకున్నాడు.