హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బీసీలు అధైర్యపడాల్సిన అవసరం లేదు: ఎమ్మెల్యే

తూ.గో: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామని, సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూనే రాజకీయంగా బీసీలకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు స్పష్టం చేశారు. బీసీలు అధైర్యపడాల్సిన అవసరం లేదని, వారి రాజకీయ ప్రాధాన్యం, గౌరవం తగ్గకుండా తగిన చర్యలు తీసుకునేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.