హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్కూళ్ల యాజమాన్యాలకు DEO వార్నింగ్

TPT: దసరా సెలవుల్లో పాఠశాలలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖాధికారి కే.వీ.ఎన్.కుమార్ హెచ్చరించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు అక్టోబరు 12 నుంచి 21 వరకు, క్రిస్టియన్ మైనారిటీ పాఠశాలలకు 15 నుంచి 21 వరకు సెలవులు ఉంటాయని, 22న పునఃప్రారంభమవుతాయని తెలిపారు. సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే గుర్తింపు రద్దుకు చర్యలు తీసుకుంటామన్నారు.