హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల భద్రతపై ఎస్పీ సమీక్ష

BPT: స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని బాపట్ల జిల్లా ఎస్పి ఉమామహేశ్వర్ ఆదేశించారు. శుక్రవారం పోలీస్ అధికారులతో వర్చువల్ విధానంలో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని, గత ఘటనలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.