హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ముద్దనూరులో స్మార్ట్ కిచెన్ ప్రారంభం

KDP: ముద్దనూరు బాలుర ఉన్నత పాఠశాలలో స్మార్ట్ కిచెన్‌ను మండల అభివృద్ధి అధికారి రాధాకృష్ణవేణి ప్రారంభించారు. మండలంలోని 42 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 1,980 మంది విద్యార్థులకు మూడు వాహనాల ద్వారా ప్రతిరోజూ మెనూ ప్రకారం భోజనం అందించనున్నట్లు ఎంఈఓ నాగేశ్వర నాయక్ తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందిస్తామని మహిళా సమాఖ్య ప్రతినిధులు పేర్కొన్నారు.