హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'బాల్యవివాహాల నియంత్రణకు ముందుకు రావాలి'

NTR: జగ్గయ్యపేట ప్రిన్సిపల్ సివిల్ జడ్జి హిమబిందు బాల్యవివాహాల నియంత్రణకు ప్రజలందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మండల న్యాయ సేవా అధికార కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయవిజ్ఞాన సదస్సులో ఆమె మాట్లాడుతూ.. బాలల హక్కులను పరిరక్షించాలని, వారికి అన్యాయం జరిగితే స్థానిక న్యాయ సేవా కమిటీలను ఆశ్రయించాలని సూచించారు.