హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కొండచరియలు, మట్టిపెళ్లలను తొలగించాలి'

ASR: జీకేవీధి మండలం రంపుల ఘాట్‌లో వారం క్రితం విరిగిపడిన కొండచరియలు, మట్టిపెళ్లలను అధికారులు ఇంకా తొలగించలేదు. దీంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఘాట్‌లో రక్షణ గోడలు లేకపోవడంతో చిన్నపాటి వర్షాలకే బండరాళ్లు, మట్టి రహదారిపైకి జారిపడుతున్నాయి. రాత్రివేళ ప్రయాణించే వారికి ప్రమాదం పొంచి ఉంది. హైవే అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.