హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదంలో ఆటోడ్రైవర్ మృతి

NTR: కంచికచర్ల సమీపంలోని పేరకలపాడు హైవేపై శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను వెనుక నుంచి కంటైనర్ ఢీకొట్టడంతో ఆటో డ్రైవర్ మృతి చెందాడు. మృతుడు నందిగామ మండలం చందాపురం గ్రామానికి చెందిన కనకపూడి కోటేశ్వరరావుగా గుర్తించారు. మృతదేహాన్ని నందిగామ మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.