ASR: SIR ప్రక్రియ రద్దు చేసి తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలని AISF జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ డిమాండ్ చేశారు. నిన్న చింతపల్లిలో విద్యార్థులతో నిరసన చేపట్టారు. ఓటు హక్కును పరిరక్షించాలని, విద్యార్థి సంఘ నాయకులపై అక్రమ కేసులు ఎత్తివేసి, అరెస్టు చేసిన నాయకులను విడుదల చేయాలన్నారు. ప్రశ్నించే హక్కును అణచివేయొద్దన్నారు. అక్రమ అరెస్టులు ఆపాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఓట్లను పునరుద్ధరించాలి: AISF


