ASR: డుంబ్రిగుడ మండలంలో నిన్న రోడ్డు ప్రమాదం జరిగింది. బీజమర గ్రామానికి చెందిన ప్రయాణికులతో వెళ్తున్న ఆటో బోల్తాపడి పలువురు గాయపడ్డారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ వెంటనే స్పందించారు. అంబులెన్స్ ఆలస్యం కావడంతో, అనుచరుల సహాయంతో క్షతగాత్రులను ఆటోలో అరకులోయ ఆసుపత్రికి తరలించారు. ఆపదలో సాయం అందించిన ఆయనను పలువురు అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
క్షతగాత్రులకు జీసీసీ చైర్మన్ తక్షణ సాయం


