SKLM: నందిగాం మండలం నర్సిపురం కూడలి సమీపంలో జాతీయ రహదారిపై లారీ ఢీకొని వ్యక్తి మృతి చెందారు. కోమటూరు గ్రామానికి చెందిన ఇప్పిలి షణ్ముఖరావు (39) రాత్రి గొర్రెలకు మేత తీసుకురావడానికి వెళ్లి తిరిగి వస్తుండగా వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్ఐ షేక్ మహ్మద్ అలీ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదంలో గొర్రెల కాపరి మృతి


