హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆధునికీకరణ పనుల దృష్ట్యా ఈ రైళ్లు రద్దు!

VSP: రాయగడ డివిజన్ కేవిటిగూడ - సికార్పాయి స్టేషన్ల మధ్య టన్నెల్-32 ఆధునికీకరణ పనుల దృష్ట్యా ట్రాఫిక్, పవర్ బ్లాక్ విధించినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఈనెల 10, 12, 16 తేదీల్లో కోరాపుట్-విశాఖపట్నం (58537), విశాఖపట్నం-కొరాపుట్ (58538) ప్యాసింజర్ రైళ్లను పూర్తిగా రద్దు చేసినట్లు శుక్రవారం వెల్లడించింది. ప్రయాణికులు ఈ మార్పును గమనించాలని సూచించింది.