BDK: బూర్గంపాడు కృష్ణసాగర్ గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ సర్పంచ్ తాటి వాణి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును కలిసి వినతిపత్రం అందజేశారు. సీతారామ ప్రాజెక్టు కాలువ నీటిని లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా చెరువుకు అనుసంధానించాలని, బీటీ, సీసీ రోడ్లతో పాటు డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ భూక్య మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
గ్రామ సమస్యలపై ఎమ్మెల్యేకు సర్పంచ్ వినతి


