హైదరాబాద్: 28°C
తెలంగాణ

ట్రాక్టర్ జనరేటర్‌తో పొలానికి నీటీ పారుదల

SRD: కల్హేర్ మండలం మాసాన్‌పల్లికి చెందిన రైతు కలాలి ఆగం గౌడ్ ఐదు ఎకరాల్లో వరి సాగు చేశారు. గ్రామంలో తీవ్రమైన లో-వోల్టేజ్ సమస్య కారణంగా బోరు మోటార్లు నడవక పంట ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో పంటను కాపాడుకునేందుకు ఆయన మూడు రోజులుగా ట్రాక్టర్‌కు జనరేటర్ అమర్చి పొలానికి నీరందిస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి లో-వోల్టేజ్ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.