BHPL: మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద గోదావరి పరిసరాలు అపరిశుభ్రంగా మారాయని సందర్శకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నది పరిసరాలను శుభ్రం చేయకపోవడంతో దుర్వాసన వెదజల్లుతోందని, పర్యాటకులు, భక్తులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారులు స్పందించి సంగమ ప్రాంతాన్ని శుభ్రం చేసి, పరిశుభ్రత చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: త్రివేణి సంగమం వద్ద అపరిశుభ్రత


