హైదరాబాద్: 28°C
తెలంగాణ

1.1 కిలోల గంజాయి పట్టివేత

KNR: కరీంనగర్ రూరల్ మండలం మాలగుట్టల సమీపంలో గంజాయి విక్రయిస్తున్న యువకుడిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. మంచిర్యాల జిల్లా దాంపూర్‌కు చెందిన పైల్లా శ్రీమాన్ (18) వద్ద నుంచి 1.1 కిలోల గంజాయి, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. చంద్రాపూర్ నుంచి గంజాయి తీసుకొచ్చి ప్యాకెట్లుగా విక్రయిస్తున్నట్లు విచారణలో గుర్తించామన్నారు.